
అల్బెండజోల్‌తో దుష్ప్రభావం ఉండదు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): అల్బెండజోల్ మా త్రలతో ఎలాంటి దుష్ప్రభావం ఉండదని, ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా అధికారులతో కలిసి బాలబాలికలకు అల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 01 నుంచి 19ఏళ్ల వయస్సు వారందరికీ తప్పనిసరిగా నులి పు రుగుల నివారణ మాత్రలు వేయించాలన్నారు. జి ల్లాలో 4 లక్షల మందికి అల్బెండజోల్ మాత్రలు వేయడం లక్ష్యమన్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీల్లో ఏ ఒక్కరూ తప్పిపోకుండా పిల్లలు మాత్రలు వేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయా లని విద్య, వైద్యారోగ్య శాఖల అధికారులను ఆదేశించారు. ఎవరైనా తప్పిపోతే ఈనెల 18న మలి విడతగా చేపట్టే కార్యక్రమంలో తప్పనిసరిగా మా త్ర వేసేలా చూడాలన్నారు. నూటికి నూరు శాతం విజయవంతమయ్యేలా వైద్య, విద్యా శాఖతోపాటు ఐసీడీఎస్, సంక్షేమ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. నులి పురుగుల కారణంగా పిల్లలు ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు లోనవుతారని వివరించారు. 1,009 మంది విద్యార్థులతో కొనసాగుతున్న బోర్గాం(పీ) జెడ్పీహెచ్‌ఎస్ నిర్వహణపై ప్రజల్లో సదాభిప్రాయం ఉందని, దీనికనుగుణంగా స్కూల్‌లో అవసరమైన వసతులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అవసరమైతే ఈ విషయంలో రాష్ట్రస్థాయిలో ని ఉన్నతాధికారులను సంప్రదించి సౌకర్యాల మె రుగుదలకు చొరవ చూపుతామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీఈవో అశోక్, జిల్లా ఇ మ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, పాఠశాల హెచ్‌ఎం శంకర్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆందోళన అవసరం లేదు
నులిపురుగుల కారణంగా రుగ్మతలు
1 నుంచి 19 ఏళ్లలోపు వారందరికీ మాత్రలు వేయాలి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి