రెడ్‌ నోటీస్‌ | - | Sakshi
Sakshi News home page

రెడ్‌ నోటీస్‌

Aug 11 2025 6:27 AM | Updated on Aug 11 2025 6:27 AM

రెడ్‌

రెడ్‌ నోటీస్‌

నిజామాబాద్‌

కట్టడి చేసినా..

జిల్లాలో గంజాయి కట్టడికి పోలీసులు ఎంత ప్రయత్నం చేస్తున్నా.. స్మగ్లర్లు ఏదో ఒకవిధంగా తమ దందాను కొనసాగిస్తున్నారు.

సోమవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2025

– 8లో u

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో దశాబ్దాలుగా పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 1996 నుంచి పన్ను చెల్లించని వారి జాబితాను రూపొందించారు. వివిధ కారణాలు చూపుతూ కోర్టుకు వెళ్లిన వారు.. నాటి నుంచి పాత, కొత్త పన్ను చెల్లించడం లేదు. అధికారులు ప్రశ్నిస్తే వ్యవహారం కోర్టులో ఉందంటూ తప్పించుకుంటున్నారు. అయితే రూ.26 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసే లక్ష్యంతో అధికారులు శుక్రవారం నుంచి రెడ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు.

నిజామాబాద్‌ సిటీ: మొండి బకాయిలు నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు తలకుమించిన భారంగా మారాయి. కోట్లాది రూపాయల వసూలుకాకపోవడంతో బల్దియా ఆదాయానికి గండిపడుతోంది. పలువురు బడా వ్యాపారులు కోర్టుల్లో కేసులు వేసి పన్నులు చెల్లించకుండా దర్జాగా వ్యాపారాలు చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. బల్దియాకు చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొండి బకాయిలపై జిల్లా కలెక్టర్‌, ప్రత్యేక అధికారి వినయ్‌కృష్ణారెడ్డి బకాయి వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పెండింగ్‌ పన్ను వసూళ్ల కోసం కమిషనర్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

కోర్టు కేసులంటూ..

అధికారులు పన్ను ఎక్కువ వేశారంటూ కొందరు కోర్టులో కేసులు వేశారు. అయితే తీర్పు రాకపోవడాన్ని సాకుగా చూపుతున్నారు. ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పన్ను సైతం చెల్లించడం లేదు. నగరంలోని రెండు ప్రముఖ హోటళ్లే రూ.13 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని తెలిసింది. వీరితోపాటు బహుళ అంతస్తుల భవనాలు, మల్టీప్లెక్స్‌లు, ఫర్నిచర్‌ షాపులు, ఆస్పత్రులు కూడా మొండి బకాయిల లిస్టులో ఉన్నట్లు తెలిసింది.

పెద్దలను ఎందుకు

వదిలేస్తారు..

సాధారణ పౌరులు బల్దియాకు పన్ను చెల్లించకుంటే ఇంటికి వచ్చి మరీ వసూలు చేస్తున్నారు. పెద్దవాళ్లని ఎందుకు వదిలేస్తున్నారు. స్టార్‌ హోటళ్లు, పెద్ద దుకాణదారులను ఉపేక్షించడం సరికాదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి. పన్ను రికవరీలో బల్దియా అధికారుల ఉదాసీనత సరికాదు.

– వి.ప్రభాకర్‌, న్యూడెమోక్రసీ (మాస్‌లైన్‌)

రాష్ట్ర నాయకుడు

స్పెషల్‌ డ్రైవ్‌తో..

కార్పొరేషన్‌ పరిధిలో రూ. 26 కోట్లు పెండింగ్‌ బకాయిలున్నట్లు గుర్తించాం. చెల్లించాల్సిన వారికి రెడ్‌నోటీసులు జారీచేస్తున్నాం. గడువులోగా చెల్లించకుంటే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే సీజ్‌లు చేస్తాం. ప్రతి ఒక్కరూ విధిగా పన్ను చెల్లించాలి. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – దిలీప్‌కుమార్‌, బల్దియా కమిషనర్‌

1200 అసెస్‌మెంట్లు

పన్ను చెల్లించకుండా తప్పించుకుంట్నువారిని బల్దియా రెవెన్యూ అధికారులు గుర్తించారు. వారిలో 1996 నుంచి పన్ను చెల్లించని వారి పేర్లు సైతం ఉన్నాయి. మొత్తం 1200 అసెస్‌మెంట్లను గుర్తించిన అధికారులు వారికి రెడ్‌ నోటీసులు అందజేస్తున్నారు. వారం రోజుల్లో పన్ను చెల్లించకుంటే చర్యలు తప్పవని, స్పందించని పక్షంలో సీజ్‌ చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి

బకాయి వసూళ్లపై కలెక్టర్‌, కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారి వినయ్‌కృష్ణారెడ్డి దృష్టి సారించారు. కోర్టు కేసులంటూ తప్పించుకునేవారిని ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నోటీసులు ఇవ్వాలని, నోటీసులు తీసుకుని స్పందించని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉన్నతస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో రూ.26 కోట్లు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

మున్సిపల్‌ కార్పొరేషన్‌పై

ప్రత్యేక దృష్టి

1996 నుంచి పన్ను చెల్లించని

వారి జాబితా సిద్ధం

రూ.26 కోట్ల మేర పాతబకాయిలు

రెండు స్టార్‌ హోటళ్లు చెల్లించాల్సింది రూ.13 కోట్లు..

కోర్టు కేసులంటూ అసలుకే

చెల్లించని వైనం

కలెక్టర్‌ ఆదేశాల మేరకు

నోటీసులిస్తున్న అధికారులు

రెడ్‌ నోటీస్‌1
1/4

రెడ్‌ నోటీస్‌

రెడ్‌ నోటీస్‌2
2/4

రెడ్‌ నోటీస్‌

రెడ్‌ నోటీస్‌3
3/4

రెడ్‌ నోటీస్‌

రెడ్‌ నోటీస్‌4
4/4

రెడ్‌ నోటీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement