
భయపెడుతున్న చిరుత పులి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ సిద్ధుల గుట్టపై మూడు నె లల క్రితం చిరుత సంచారం పట్టణ ప్రజలతోపాటు సందర్శకులను కంటి మీద కునుకులేకుండా చేసింది. తాజాగా గుట్టకు అతి సమీపంలోని పెద్దమ్మ ఆ లయ పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలను కలవరపెడుతోంది. శుక్రవారం ఆలయానికి వచ్చిన భక్తులకు చిరుత కదళికలు భయాందోళనకు గురిచేశా యి. అంకాపూర్‌కు చెందిన ఓ గొర్రెల మంద నుంచి రెండు మేకలు కనిపించకపోవడం చిరుత సంచారానికి బలం చేకూర్చింది. విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు ఆదివారం చిరుత ఆనవాళ్ల కోసం కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. కాగా, శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఆనవాళ్లేమీ కనిపించలేదు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు సూచించారు.
మొన్న సిద్ధుల గుట్టపై, ఇప్పుడు
పెద్దమ్మ గుడి పరిసరాల్లో..
ఆర్మూర్ పట్టణ ప్రజల్లో కలవరం