
బీమా.. రైతన్నకు ధీమా
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే వారి కు టుంబసభ్యులకు బాసటగా నిలుస్తోంది. రూ.5లక్షల ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతోంది. ఈ పథకానికి రైతులపై భా రం లేకుండా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లి స్తోంది. ప్రస్తుతం బీమా చేసుకోవడానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 13వరకు గడువు ఉండగా అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
జిల్లాలో 1.69లక్షల మంది నమోదు
రైతుబీమా పథకానికి జిల్లాలో ఇప్పటి వరకు 1.69లక్షల మంది నమోదు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం ఏడాదికోసారి ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేస్తూ వస్తోంది. గడిచిన ఏడేళ్లలో 7,135మంది రైతులు మరణించగా, వారి కుటుంబాలకు రూ.357.10కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం జూన్ 5నాటికి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు జిల్లా వ్యాప్తంగా ఐదారు వేల మంది ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. వీరు బీమా కోసం దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది.
అర్హతలు ఇవే..
జూన్ 5వ తేదీ నాటికి పట్టాదారుగా నమోదై ఉండాలి.
18–59 సంవత్సరాల వయసు ఉండాలి.
రైతు, నామినీ ఆధార్ కార్డు, పట్టాదారు పుస్తకం జిరాక్స్ పత్రాలతోపాటు దరఖాస్తు ఫారాన్ని నేరుగా రైతువేదికల్లో ఏఈవోలకు సమర్పించాలి.
పట్టా పుస్తకం రానివారు ఆన్‌లైన్‌లో డిజిటల్ సైన్ ఉన్నా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఏడేళ్లుగా బీమా పొందిన రైతు కుటుంబాలు
కొత్త దరఖాస్తులకు ఆహ్వానం
జూన్ 5నాటికి పట్టాపాస్ పుస్తకాలు
పొందిన రైతులకు అవకాశం
ఈ నెల 13 వరకు గడువు
ఏఈవోలను సంప్రదించాలి
రైతుబీమా పథకాన్ని అర్హులైన ప్రతి రైతు సద్వినియో గం చేసుకోవాలి. కొత్త పట్టా పాసు పుస్తకాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలి. నేరుగా రైతు వేదికల్లోని ఏఈవోలను సంప్రదించాలి.
– మేకల గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి

బీమా.. రైతన్నకు ధీమా