
రాజకీయ దురుద్దేశంతోనే దుష్ప్రచారం
నిజామాబాద్ సిటీ: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మీద రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకుండా రైతాంగానికి అన్యా యం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలి సి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని చివరి ఆయకట్టు వరకు మూడు పంటలకు సాగునీరివ్వాలన్న ఆలోచనతోనే కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మించామన్నారు. ప్రాజెక్టులోని చిన్న సమస్యను పరిష్కరించకుండా కొండంత చేసి దుష్ప్రచారం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదన్నారు. మేడిగడ్డను పండబెట్టి బనకచర్లకు గో దావరి నీళ్లను దోచిపెడుతూ తన గురువు చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి గురుదక్షిణ ఇచ్చాడని విమర్శించారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్ర బాబు, బీజేపీ కలిసి ఇచ్చిన రిపోర్టునే జస్టిస్ ఘోష్ ఇచ్చారని, అది కోర్టులో చెల్లదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో సుంకిశాల గోడలు, ఎస్‌ఎల్‌బీసీ ట న్నెల్ కూలిపోయిందని, పెద్దవాగుకు గండపడినా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, హరీశ్‌రావులను ఎ లా బాధ్యులను చేస్తారన్నారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయ ని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కేంద్ర సహాయమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఘోష్ కమిషన్ ముందుకు వె ళ్లడం ఏమిటని ప్రశ్నించారు. బండి సంజయ్ బజా రు భాష మాట్లాడుతున్నారని, కేటీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు సభ్యసమాజం సిగ్గుపడుతుందన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రె డ్డి, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సత్యప్రకాశ్, సి ర్పరాజు, సుజిత్ సింగ్, దొన్కంటి నర్సయ్య, బాజిరెడ్డి రమాకాంత్, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై రాజకీయ కక్ష
అది ఘోష్ కమిటీ కాదు.. ఘోస్ట్ కమిటీ
చంద్రబాబు మెప్పుకోసమే
బనకచర్లకు నీళ్లు
కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను టార్గెట్ చేశాయి
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి