
మద్యంమత్తులో యువకుడి వీరంగం
నిజామాబాద్ రూరల్: మండలంలోని గూపన్‌పల్లి గ్రామంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి, ముగ్గురిపై దాడిచేసి గాయపర్చాడు. నిందితుడిని పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించా రు. రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరీఫ్ తెలిపిన వి వరాలు ఇలా.. గ్రామానికి చెందిన మదన్ అనే వ్యక్తి శనివారం రాత్రి కల్లుబట్టిలో మద్యం తాగి సమీపంలో గల అనిల్ అనే వ్యక్తి ఇంటి ఎదుట నిద్రించాడు. కొద్దిసేపటికి ఇంటికి చెందిన అనిల్, శైలేందర్‌లు ఇంట్లోకి వెళుతుండగా మదన్‌కు కాళ్లు తగలడంతో మేల్కొన్నాడు. దీంతో మదన్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం మదన్ పగిలిన కల్లుసీసాతో శై లేందర్ ఎడమచేతిని గాయపరిచారు. అనిల్, అతడి అక్క దీపిక అడ్డురావడంతో మదన్ వారిపై సైతం దాడిచేసి గాయపర్చారు. వెంటనే గ్రామ పెద్దలు ఘటన స్థలానికి చేరుకొని ఇరువురిని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై బాధితులు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ముగ్గురిపై కల్లుసీసాతో దాడి
నిందితుడిని రిమాండ్‌కు తరలించిన రూరల్ పోలీసులు

మద్యంమత్తులో యువకుడి వీరంగం