
కళాశాలల్లో ‘మధ్యాహ్న భోజనం’ కలేనా?
నందిపేట్(ఆర్మూర్): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ‘మధ్యాహ్న భోజన పథకం’ కలగానే మిగిలిపోతుందేమోనని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని గతంలో ప్రతిపాదనలు పంపించినా ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కళాశాలలకు దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
మారుమూల గ్రామాల నుంచి పేద విద్యార్థులు ఆర్టీసీ బసుల్లో, సైకిళ్లపై సమీప పట్టణాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వచ్చి చదువుకుంటారు. దూరప్రాంతాల విద్యార్థులు ఇంటి నుంచి ఉదయం తొందరగా బయలుదేరితేనే కళాశాలకు సకాలంలో చేరుకుంటారు. ఈక్రమంలో కొందరు విద్యార్థులు ఇంట్లో ఉదయం టిఫిన్ తయారీతో ఆలస్యం కావడంతో టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకోకుండానే కళాశాలకు వెళుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జూనియర్ కళాశాల తరగతులు నిర్విహిస్తుండటంతో వారు అర్ధాకలితో అలమటిస్తున్నారు. దీంతో విద్యార్థులు పూర్తిస్థాయిలో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు.
జిల్లాలో 31 కళాశాలలు..
జిల్లాలో 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. ఇందులో సుమారు 9850 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో కొందరు విద్యార్థులు మా త్రమే నిత్యం తమ ఇంటి వద్ద నుంచి టిఫిన్ బాక్సు లతోపాటు వాటర్ బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. మి గిలిన వారు అర్ధాకలితోనే విద్యను కొనసాగిస్తున్నా రు. ప్రభుత్వం స్పందించి కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలుకు నోచుకోని పథకం
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

కళాశాలల్లో ‘మధ్యాహ్న భోజనం’ కలేనా?