
తీజ్ సందడి
మోపాల్ : మండలంలోని ఎల్లమ్మకుంటలో ఆదివారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. పెళ్లి కాని యువతులు 9 రోజులపాటు గోధుమబుట్టలకు ప్రత్యేక పూజలు చేశారు. చివరిరోజు గోధుమబుట్టలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. అంతకుముందు సేవాలాల్ మహరాజ్, జగదాంబ మాతా ఆల యాల్లో పూజలు చేసి, బోగ్‌భండార్ నిర్వహించా రు. వేడుకలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటే ల్ కులాచారి, కాంగ్రెస్ ఆదివాసీ, గిరిజన జిల్లా చై ర్మన్ కెతావత్ యాదగిరి, జెడ్పీటీసీ మాజీ సభ్యు డు మోహన్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధా న కార్యదర్శి నరేశ్ నాయక్, బుజ్జి రతన్, తండా నాయక్ జోర్‌సింగ్ , కారొబార్ ప్రకాశ్ ఉన్నారు.
మాక్లూర్: మండలంలోని అమ్రాద్ తండా, మద న్‌పల్లితండా, సట్లాపూర్‌తండా, కృష్ణానగర్‌తండాలలో గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. గిరిజన యువతులు ముందుగా మొలకెత్తిన గోధుమ నారును నెత్తిన పెట్టుకుని సేవాలాల్ మందిరం వరకు ఊరేగింపుగా వెళ్లా రు. గిరిజన మహిళలు వారి సంప్రదాయ దుస్తుల ను ధరించి నృత్యాలు చేశారు. అనంతరం సేవాలాల్ మహరాజ్ మందిరం వద్ద నైవేద్యాలు సమర్పించి వన భోజనాలు చేశారు.

తీజ్ సందడి