
నిరీక్షణ ఇంకెన్నాళ్లు..?
● పెండింగ్‌లోనే అభివృద్ధి పనుల బిల్లులు
● నిధుల కోసం ఎదురుచూస్తున్న
మాజీ సర్పంచులు
మోర్తాడ్(బాల్కొండ): గ్రామాల్లో గత సర్పంచులు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు ఇప్పటికీ విడుదల కాలేవు. దీంతో వారు నెలల తరబడి నిధుల రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 2024లో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిపోయింది. అంతకుముందు నుంచే వారికి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్పంచ్‌లుగా వ్యవహరించిన వారికి బిల్లులు మంజూరు చేయకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడాదిపాటు కాలయాపన చేసింది. అప్పట్లో ఆ పార్టీకి చెందిన వారే సర్పంచ్‌లుగా ఎ క్కువ మంది ఉండటంతో బిల్లుల గురించి అప్పటి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోయారు. ప్రస్తు తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మాజీ సర్పంచ్‌ల బిల్లులకు మోక్షం లభించడం లేదు.
జిల్లాలో రూ.15 కోట్లకు పైగా పెండింగ్..
జిల్లాలోని మాజీ సర్పంచ్‌లకు దాదాపు రూ.15 కో ట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అంచనా. 15వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ నిధులకు సంబంధించి బిల్లులు చేసి పంపినా ట్రెజరీల్లోనే చెల్లింపులు నిలిచిపోయాయి. కొందరు సర్పంచ్‌లకు టోకెన్‌లు జారీ చేసినా నిధులు లేకపోవడంతో ఖాతాల్లో సొమ్ము జ మ కావడం లేదు. తమ బిల్లుల కోసం మా జీ స ర్పంచ్‌లు అనేక మార్లు సచివాలయం, అసెంబ్లీ ము ట్టడికి పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడానికి యత్నించగా పోలీసులు ముందస్తు అరెస్టులతో అడ్డుకున్నారు. గత ప్రభుత్వాన్ని బిల్లుల కోసం ప్రశ్నించని నాయకులు ఇప్పు డు నిరసన తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పరువు తీయాలని చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ముడుపులు ఇస్తామంటూ..
బిల్లులకు సంబంధించి పలువురికి టోకెన్‌లను ఆర్థి క శాఖ జారీ చేసింది. కాగా బిల్లుల చెల్లింపులు మొ త్తం హైదరాబాద్ నుంచి పెండింగ్‌లో ఉండటంతో ఒక్కో బిల్లుకు 18 శాతం వరకు ముడుపులు ఇస్తా మని ఉద్యోగులను ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. కానీ మాజీ సర్పంచ్‌లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. ఏదేమైనా మాజీ సర్పంచ్‌లు తమ బి ల్లుల కోసం నిరీక్షించక తప్పదని స్పష్టమవుతోంది.
మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామ సర్పంచ్ కడారి శ్రీనివాస్ తన పదవీ కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టగా, అందుకు సంబంధించి రూ.58 లక్షల బిల్లు ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సి ఉంది. అలాగే మోర్తాడ్ గ్రామ సర్పంచ్‌గా పని చేసిన ధరణికి కూడా పలు పనులకు సంబంధించి రూ.70 లక్షల బిల్లు మంజూరు కావాల్సి ఉంది. వీరి పదవీ కాలం ముగిసిపోయి ఏడాదిన్నర కాలం అవుతున్నా ఇప్పటికీ బిల్లులు మాత్రం రాలేదు. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల మాజీ సర్పంచ్‌లకు సైతం బిల్లులు మంజూరు కాకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి..
ప్రజలు మాపై నమ్మకంతో సర్పంచ్‌లుగా ఎన్నుకున్నారు. వారికి సౌకర్యాలను కల్పించడానికి అభివృద్ధి ప నులకు సొంతంగా అప్పులు చేసి పనులు పూర్తి చేశాం. రూ.లక్షల్లో అప్పులు చేసిన ఎంతోమంది వడ్డీ చెల్లించడానికి అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి.
– కడారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్, సుంకెట్
ఆస్తులు అమ్ముకుంటున్నారు..
సర్పంచ్‌లుగా పని చేసిన వా రికి రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో అప్పు లు తీర్చడం కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. వడ్డీ భారంతో ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది మాజీ సర్పంచ్‌లు దిగులుతో మరణించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి.
– గడ్డం చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్, తిమ్మాపూర్

నిరీక్షణ ఇంకెన్నాళ్లు..?

నిరీక్షణ ఇంకెన్నాళ్లు..?