
కిటకిటలాడిన బస్టాండ్
నిజామాబాద్ బస్టాండ్‌లో గుమిగూడిన ప్రయాణికులు
నిజామాబాద్ బస్టాండ్ శనివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. రాఖీ పండుగను పురస్కరించుకొని సోదరులకు రాఖీ కట్టేందుకు, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవడానికి తమ ఊర్లకు వెళ్లేందుకు మహిళలు భారీగా బస్టాండ్‌కు తరలివచ్చారు. బస్సుల కోసం ఎదురుచుస్తున్న ప్రయాణికులతో బస్టాండ్ సందండిగా మారింది. రద్దీ ఎక్కువ ఉండటంతో సీట్ల కోసం ప్రయాణికులు బస్సులు రాగానే ఎగబడ్డారు. మరికొందరూ కిటికీల నుంచి దూరి సీట్లను దక్కించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్

కిటకిటలాడిన బస్టాండ్