
అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి
మోపాల్: మండలంలోని బైరాపూర్ శివారులోని మోతీరాంనాయక్ తండాలో గిరిజనులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటపై గడ్డి మందు చల్లి ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని ఏఐబీఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రామావత్ మోహన్ నాయక్ డిమాండ్‌చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి, అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీహరి నాయక్, చౌహన్ మోహన్ నాయక్, పీర్‌సింగ్, గంగాధర్, రవి రాథోడ్, బాలు నాయక్, ఇందల్, జలంధర్, గౌతమ్, కమలాజీ, రమేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వసతిగృహ అధికారికి ఆర్థికసాయం
నిజామాబాద్‌అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వసతి గృహ అధికారి రాజేందర్‌కు శుక్రవారం వార్డెన్ల సంక్షేమ సంఘం ఆర్థిక సహాయాన్ని అందించింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ వసతి గృహాధికారిగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ ఈనెల 6న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో సంక్షేమ వసతి గృహ అధికారులు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్ రూ. 80 వేల ఆర్థికసాయాన్ని అందించారు. కార్యక్రమంలో వసతి గృహాధికారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చెందర్, టీఎన్జీవోస్ జనరల్ సెక్రెటరీ జాఫర్ తదితరులు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
నిజామాబాద్ నాగారం: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కోశాధికారి లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని వివేకానందనగర్ కాలనీలో శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. కాలనీవాసులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.లింబాద్రి, పి.రాఘవేందర్, కోశాధికారి ఎ.రాజేందర్, జి.రామకృష్ణ రెడ్డి, గంగాదాస్, వెంకటరమణ, బాబుకృష్ణ, రాజశేఖర్, కాలనీవాసులు నర్సింహారెడ్డి, నర్సారెడ్డి, తుకారాం, విజయలక్ష్మి, శారద, రవి, కృష్ణ, నవీన్ కుమార్ పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుతో
అధిక లాభాలు
జక్రాన్‌పల్లి: ఆయిల్ పామ్ పంట సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారిణి దేవిక సూచించారు. శుక్రవారం మండలంలోని కొలిప్యాక్‌లో ఆయిల్ పామ్ పంట సాగు పై రైతులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. హార్టికల్చర్ అధికారి రాజు, ఏఈవో శివ ప్రసాద్, ప్రీ యూనిక్ కంపెనీ క్లస్టర్ ప్రతినిధి రాకేశ్, గ్రామ మాజీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి

అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి

అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి