
సంక్షిప్తం
రజతోత్సవ మహాసభల్లో సత్యానంద్
నిజామాబాద్‌అర్బన్: కోల్‌కతలో ఈ నెల 8 నుంచి10వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రజతోత్సవ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ హాజరయ్యారు. ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారుగా 37 మంది ప్రతినిధులు హాజరుకాగా జిల్లా నుంచి డి. సత్యానంద్ పాల్గొన్నారు. మహాసభల్లో జాతీయ విద్యా విధానాన్ని పునరుద్ధరించాలని, మధ్యాహ్న భోజన స్లాబ్ రేట్స్ పెంచాలని, విద్యార్థులకు సరిపడా అన్ని రకాల స్టేషనరీ అందించాలన్న అంశలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
హైమాస్ట్ లైట్ల ప్రారంభం
సిరికొండ: మండలంలోని తూంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీజేపీ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ మంజూరు చేసిన నిధులతో లైట్లను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. పార్టీ మండల ఉపాధ్యక్షుడు అన్నారం గంగామురళి, మండల కార్యదర్శి జినుక రాజేందర్, బూత్ అధ్యక్షుడు అరిగెల రమేశ్, సత్తూర్ రవి, బూస రాజు, గంగాధర్, రాజేశ్వర్, నరేశ్, రాజు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యసమాజ్‌లో యజ్ఞం
నిజామాబాద్ రూరల్: ఇందూరు ఆర్యసమాజ్‌లో శ్రావణమాస యజుర్వేద పారాయణ యజ్ఞములను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాల సందర్భంగా రామగిరి సుదర్శన ముని సిద్ధిరాములు, కరిపె సూర్యప్రకాశ్, మల్లికార్జున, ప్రశాంత్ దంపతులు పూజలు చేశారు.
వీడీసీల ఆగడాలను అరికట్టాలి
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో వీడీసీల ఆగడాలని అరికట్టాలని దళిత సంఘాల బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రసాద్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఇటీవల ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్‌లో మాదిగ కులస్తులను గ్రామ అభివృద్ధి కమిటీ బహిష్కరించడం అన్యాయం అన్నారు. ఆ గ్రామంలో మడిగెల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదంలో వీడీసీ కులస్తులను బహిష్కరించి వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చేయడం దారుణమన్నారు. వ్యవసాయ పనులు జరగకుండా, నిత్యావసర సరుకులు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
ఇందల్వాయి: భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆర్డీవో రాజేంద్ర కుమార్ అధికారులకు సూచించారు. ఇందల్వాయి తహసీల్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. భూభారతి రెవెన్యు సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆలస్యం చేయకుండా తొందరగా విచారణ చేపట్టి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రేషన్‌కార్డుల దరఖాస్తులను విచారణ చేపట్టి అర్హులకు రేషన్‌కార్డులు అందేలా చూడాలన్నారు. తహసీల్దార్ వెంకట్‌రావు, డీటీ శైలజ, ఆర్‌ఐ మోహన్, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ పాల్గొన్నారు.