
డీఈవోకు వినతి
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధ్యాయ పదోన్నతుల్లో స్వచ్ఛందంగా తమకు పదోన్నతి వద్దు అనుకునే వారికి నాటు విల్లింగ్ ఇచ్చి పదోన్నతి నుంచి తప్పుకునే అవకాశాన్ని కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేశ్, గంగాధర్ కోరారు. డీఈవో అశోక్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మేతరి మల్లేశ్, శీను, ప్రతాప్, శ్రీనివాస్, లక్ష్మణ్, రవి, అశోక్, రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ముర్రుపాలు పట్టించాలి
జక్రాన్‌పల్లి: పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సునంద అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ గోడ గంగలక్ష్మి, కవిత, సవీణ ఏఎన్‌ఎం స్వరూపం, ఆశా వర్కర్ లత పాల్గొన్నారు.
విద్యార్థులు
అన్ని రంగాల్లో రాణించాలి
నిజామాబాద్ రూరల్: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని స్కిల్ డెవలప్‌మెంట్ ఎంప్లాయీమెంట్ ట్రెయినర్ గోపిక అన్నారు. నగరంలోని వాణి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని రాఖీలు తయారు చేయించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రమేశ్ గౌడ్, మహేశ్ కుమార్, ప్రిన్సిపాల్ స్వప్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆత్మీయ భరోసాను
అమలు చేయాలి
సిరికొండ: భూమి లేని పేదలకు ఇందిరా ఆత్మీయ భరోసాను వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి కిశోర్ డిమాండ్ చేశారు. మండలంలోని గడ్కోల్‌లో జీపీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులు లింబాద్రి, కిరణ్, అనీస్, కిశోర్, కట్ట రాములు, ఎర్రన్న, రాములు, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.