రైతుబజార్లను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రైతుబజార్లను సద్వినియోగం చేసుకోవాలి

Aug 9 2025 8:03 AM | Updated on Aug 9 2025 8:03 AM

రైతుబజార్లను సద్వినియోగం చేసుకోవాలి

రైతుబజార్లను సద్వినియోగం చేసుకోవాలి

నగరంలో మార్కెట్లను పరిశీలించిన

కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

రోడ్లపై కూరగాయలు

విక్రయించడంతో ఆగ్రహం

అమృత్‌ 2.0 పనుల పరిశీలన

నిజామాబాద్‌ సిటీ: ఇందూరు వాసుల కోసం జిల్లా కేంద్రంలో కేటాయించిన రైతుబజార్లను సద్వినియోగం చేసుకోవాలని, వాటిని ప్రజలకు అందు బాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌తో కలిసి కలెక్టర్‌ నగరంలో పర్యటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వర్తకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పులాంగ్‌ వద్దనున్న రైతుబజార్‌, డీఎస్‌ మా ర్కెట్‌ను పరీక్షించారు. వీక్లీ మార్కెట్‌, సుభాష్‌నగర్‌, శివాజీనగర్‌ ప్రాంతాలలో రోడ్లమీద కూరగాయలు విక్రయించడంపై అసహనం వ్యక్తం చేశారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్మించి వృథాగా ఉన్న మినీ మార్కెట్‌లను పరిశీలించి వా టిని వినియోగంలోకి తేవాలన్నారు. పాత గంజ్‌లో కొనసాగుతున్న మార్కెట్‌ను చూశారు. ఖలీల్‌వాడిలో నిర్మిస్తున్న సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణాలను పరిశీలించి మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడారు. రోడ్ల పక్కన కూరగాయల అమ్మకంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కూరగాయలు, పండ్ల విక్రేతలు రోడ్ల పక్కన కాకుండా రైతుబజార్లలో అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. రైతు బజార్ల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్‌, మార్కెటింగ్‌ శాఖల అధికారులను ఆదేశించారు. ఆక్రమణలను గుర్తించి, వాటిని తొలగించేందుకు డీ–మార్కింగ్‌ చేయాలన్నారు. అనంతరం అమృత్‌ 2.0 పథకంలో భాగంగా నాందేవ్‌వాడ, గౌతంనగర్‌లలో చేపడుతున్న మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. నాగారం 300 క్వార్టర్స్‌లోని బస్తీ దవాఖానను కలెక్టర్‌ సందర్శించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ ఈఈ మురళీ మోహన్‌ రెడ్డి, డీఈలు సుదర్శన్‌రెడ్డి, ముస్తాక్‌ అహ్మద్‌, రషీద్‌, ఏఈ పావని, ఇనాయత్‌ కరీం, ఏసీపీ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement