
లక్ష్మి ఆయకట్టులో జోరుగా వరినాట్లు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్ష్మికాలువ ద్వారా నీటి విడుదలతో ఆయకట్టు రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు నీరు లేక రైతులు వరినాట్లు వేయలేదు. ప్రస్తు తం ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో లక్ష్మికాలువ చివరి ఆయకట్టు డీ–4 కాలువ వరకు నీటి సరఫరా జరుగుతోంది. డీ–3పై నిర్మించిన వేంపల్లి ఎత్తిపోతల పథకం నుంచి సైతం నీటి విడుదలను శుక్రవారం ప్రారంభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నీటి విడుదలతో రైతుల హర్షం