
కమ్మర్‌పల్లిలో గంజాయి పట్టివేత
కమ్మర్‌పల్లి: మండలంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ శుక్రవారం కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ అనిల్‌రెడ్డి, సిబ్బంది కలిసి కమ్మర్‌పల్లిలోని మెట్‌పల్లి రోడ్‌లోగల రైస్‌మిల్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు కమ్మర్‌పల్లి వైపు వస్తుండగా, పోలీసులు వారిని తనిఖీ చేయగా 4 గంజాయి ప్యాకెట్‌లు కనిపించాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నాంపల్లి వికాస్, కమ్మర్‌పల్లికి చెందిన షేక్ ఇమ్రాన్‌గా గుర్తించారు. గంజాయిని కమ్మర్‌పల్లిలో విక్రయించడానికి తీసుకువస్తున్నామని, ఇంతకుముందు కూడా వికాస్ వద్ద గంజాయి కొనుగోలు చేసి కమ్మర్‌పల్లిలో విక్రయించానని షేక్ ఇమ్రాన్ ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. పట్టుకున్న గంజాయి 20 గ్రాములు ఉందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐ అనిల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ అప్సర్ సిబ్బంది రాజ్‌కుమార్, లక్ష్మణ్‌గౌడ్,, నవీన్‌చంద్ర, లక్ష్మణ్‌నేత, గణపతినాయక్ తదితరులు పాల్గొన్నారు.