
సుభాష్‌నగర్‌లో అగ్నిప్రమాదం
ఖలీల్‌వాడి: నగరంలోని సుభాష్ నగర్‌లోగల ఓ ఇంటీరియర్ షాప్‌లో శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ శంకర్ తెలిపారు. షాపు నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని ఫైరింజన్‌తో మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 వేల వరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు.
హత్య కేసులో నిందితుడి అరెస్టు
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం దొన్కల్‌లో ఒకరిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. మోర్తాడ్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొన్కల్‌లోని వడ్డెర కాలనీలో జూన్ 26న ఒల్లెపు నాగరాజు, షేక్ రహమాన్‌తో మద్యం సేవిస్తూ ఘర్షణ పడ్డారు. ఈక్రమంలో రహమాన్‌ను నాగరాజు కర్రతో కొట్టగా అతడు మృతిచెందాడు. అప్పటి నుంచి నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడన్నారు. విశ్వసనీయ సమాచారం రావడంతో నాగరాజును పట్టుకొని, రిమాండ్‌కు తరలించినట్లు సీఐం తెలిపారు. ఎస్సై రాము, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇసుక టిప్పర్ల పట్టివేత
రుద్రూర్: మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం తెల్లవారుజామున రెండు ఇసుక టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని పోలీస్‌స్టేషన్ తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు.
సిరికొండ మండలంలో..
సిరికొండ: మండలంలోని గోప్యతండా పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు. గడ్డమీదితండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ ట్రాక్టర్లలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సుభాష్‌నగర్‌లో అగ్నిప్రమాదం

సుభాష్‌నగర్‌లో అగ్నిప్రమాదం