
బాధ్యతల స్వీకరణ
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ మున్సిపల్ కమిషనర్‌గా రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బల్దియా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై సిబ్బంది ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. బల్దియాకు వచ్చే ఆదాయంతోపాటు బల్దియాకు రావాల్సిన బకాయిలపై శ్రద్ధచూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని వెల్లడించారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి బల్దియా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
గంటల తరబడి తిప్పాల్సిందే..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టలన్నా.. నీటి విడుదల పెంచాలన్నా.. తగ్గించాలన్నా గంటల తరబడి గేట్లను తిప్పాల్సిందే. లేదంటే గేట్లు లేవవు, దిగవు. గేట్లకు కరెంట్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది చేతులతోనే వాటిని ఎత్తుతున్నారు. శుక్రవారం నీటి విడుదల పెంచడం కోసం ఉదయం 7గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు గేట్లను తిప్పితే 200 క్యూసెక్కులకు నీటి విడుదల పెరిగింది. గంటల తరబడి గేట్లను తిప్పడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్‌ను
కలిసిన సుధాకర్‌గౌడ్
నిజామాబాద్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం ఓవర్‌సీస్ కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు సుధాకర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కులగణన విజయవంతంగా పూర్తిచేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు యత్నిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి, ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ ప్రజల తరపున ఓవర్‌సీస్ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ