
సెర్ప్ సీఈవోకు ‘కమ్మర్‌పల్లి’ పిండివంటలు
కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో మ హిళా సమాఖ్య సభ్యులు తయారుచేసిన పిండి వంటలు రాష్ట్ర రాజధానికి చేరాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సె ర్ప్) రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) దివ్య దేవరాజన్‌కు శుక్రవారం ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కమ్మర్‌పల్లి ఎర్గట్ల ఏపీఎం కుంట గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కమ్మర్‌పల్లి సమాఖ్య సభ్యులు వనజ ‘పెద్దమ్మ తల్లి హోమ్ ఫుడ్స్’ పేరుతో తయారుచేసిన పిండి వంటలను వారు ఆమెకు అందజేశారు. మహిళా సంఘం ద్వారా రుణం పొంది ఉపాధి పొందుతున్న సభ్యులు తయారుచేసిన లడ్డులను అందించడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏపీఎం కుంట గంగాధర్ వెల్లడించారు. మహిళా సంఘ సభ్యులు తయారుచేసిన పిండివంటలకు విస్తృత ప్రచారం లభించేలా చూడాలని అధికారి పేర్కొన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర జేఏసీ నాయకులు ఏపూరి నర్సయ్య, బాణాల రాజారెడ్డి, మహేష్, జానయ్య, యాదగిరి, రాజప్ప తదితరులు పాల్గొన్నారు.