
బ్రహ్మాజివాడిలో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రహ్మాజివాడి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామాస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జోలే శ్రీకాంత్‌రావు(30) కామారెడ్డిలో ఓ ప్రయివేటు జాబ్ చేస్తున్నాడు. అతడికి వివాహం జరిపించడానికి కుటుంబ సభ్యులు గత కొన్ని సంవత్సరాల నుంచి పెండ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ కుదర లేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీకాంత్‌రావు శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని, మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఒకరు..
బాన్సువాడ రూరల్: ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు ఇలా.. మండలంలోని చిన్నరాంపూర్ గ్రామం పులికుచ్చ తండాకు చెందిన జప్పిబాయి (60) అనే వృద్దురాలు గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయింది. ఈక్రమంలో ఈనెల 7న ఆమె పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్సనిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బ్రహ్మాజివాడిలో ఒకరి ఆత్మహత్య