
పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులను, ఇతర అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఆయన అదనపు కలెక్టర్ అంకిత్‌తో కలిసి విద్యుత్, మున్సిపల్ అధికారులు, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, పంచాయతీ రాజ్ తదితర శాఖల ఇంజినీరింగ్ అధికారులతో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్బన్ ఏరియాలల్లో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్‌లో మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. పనులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
డబుల్ బెడ్‌రూం ఇళ్లు, అసంపూర్తి
పనులపై అధికారులతో సమీక్ష