
పీహెచ్‌సీల్లోనే కాన్పులు జరగాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రభుత్వ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వైద్యాధికారులకు సూచించారు. సాధారణ చికిత్సలతోపాటు గర్భిణులకు స్థానికంగానే సుఖ ప్రసవాలు (కాన్పులు) కూడా చేయాలన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ గురు వారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మొదట పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్... ఓపీ రిజిస్టర్, సి బ్బంది హాజరును పరిశీలించారు. సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను టీహబ్‌కు పంపిస్తున్న తీరును పరిశీలించారు. వ్యాక్సినేషన్, టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలు, గ్రామాల్లో ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. సుశిక్షితులైన స్టాఫ్ నర్స్ ఉన్నప్పటికీ స్థా నికంగా కాన్పులు ఎందుకు చేయడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రతీ నెల కనీసం రెండు కా న్పులు స్థానికంగా జరిగేలా కృషి చేయాలన్నా రు. గర్భిణులకు స్థానిక పీహెచ్‌సీలో డెలివరీ సదుపాయం అందుబాటులో ఉందని ఏఎన్‌ఎంలు, ఆశాల ద్వారా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శుభాకర్‌కు సూచించారు. పీహెచ్‌సీ పనితీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ హైస్కూల్, ప్రా థమిక పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని హెచ్‌ఎంలు సురేశ్ కుమార్, సాబేర బేగంలను ఆదేశించారు. పలువురు విద్యార్థుల హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా నమోదు చేయకపోవడాన్ని గమనించి, ఎంఈవో రామకృష్ణను ఫోన్ ద్వారా కలెక్టర్ ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలును ఎందుకు పర్యవేక్షించడం లేదని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు – మన బడి కింద నూతనంగా నిర్మించిన తరగతి గదుల గోడలపై పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సహకార సంఘం ఎరువుల సేల్ పాయింట్‌ను సందర్శించి, అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల పనులపై స్థానిక అధికారులతో సమీక్షించారు.
ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ సందర్శన
చిన్నయానం శివారులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ డీఈ రవికి సూచించారు. బ్యాక్ వాటర్ ఏరియాలో నిలువ ఉన్న నీటిమట్టం, గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాక్ వాటర్ ఏరియాను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను అడిగి తెలుసుకొని, అందుకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రజలకు అన్ని రకాల
వైద్య సేవలందించాలి
డొంకేశ్వర్‌లో కలెక్టర్
వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు
ఎంపీడీవో ఆఫీసు, పాఠశాలలు, సొసైటీ గోదాం సందర్శన