
రైతులకు సరిపడా యూరియా
సుభాష్‌నగర్: జిల్లాలోని రైతాంగానికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎక్కడా కొర త లేదని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పేర్కొన్నారు. నగరంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశపు హాల్లో వ్యవసాయ, హార్టికల్చర్, మార్కెటింగ్ శాఖల పనితీరు, పథకాల అమలు, సబ్సిడీ లు, తదితర అంశాలపై గురువారం ఆయన సమీ క్షించారు. ప్రధానంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో రైతాంగానికి కల్పిస్తున్న రాయితీలు, పంటల విస్తీర్ణం, ఎరువుల నిల్వలపై డీఏవో గోవిందు, జేడీ శ్రీనివాస్‌రావును అడిగారు. 10వేలకు పైగా ఎకరాల్లో ఆయిల్ పావ్‌ు పంటను సాగు చేస్తేనే జిల్లాకు ఫ్యాక్టరీ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విషయమై రైతులకు దాని ప్రయోజనాలను వివరించాలన్నారు. జిల్లాలో పసుపు సాగు స్వ ల్పంగా పెరిగిందని అధికారులు వివరించారు. యూరియా కొరత లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని గడుగు గంగాధర్ సూచించారు.
యేటా టెండర్లు నిర్వహించాలి..
మార్కెట్ కమిటీల్లో సెక్యూరిటీ టెండర్లు ప్రతియేటా నిర్వహించాలని గడుగు గంగాధర్ ఆదేశించా రు. ఏళ్లుగా ఒక్క కాంట్రాక్టర్‌కే అప్పగించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు దళారుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని తెలిపారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీలో ఉద్యోగులు, సిబ్బంది కొరత, డిప్యుటేషన్ల వివరాలతోపాటు ఆదాయం, ఖర్చు లు, గోదాములు తదితర అంశాలను సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ వివరించారు. ఉద్యోగుల కొరత, హోల్‌సేల్ మార్కెట్‌లో కొత్త లైసెన్సులు, మడిగెల నిర్మాణం తదితర అంశాలపై ఇప్పటికే మంత్రి తు మ్మల నాగేశ్వర్‌రావు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి వివరించారు. అనంతరం దడువాయిలు, హమాలీలు, చాటా కార్మికులు గడుగు గంగాధర్‌ను కలిసి సమస్యలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ క మిటీ వైస్ చైర్మన్ జంగిటి రాంచందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి గంగు, ఏడీఏ కృష్ణ, డైరెక్టర్లు మా రుతీ మల్లేశ్, గంగారెడ్డి, రాజలింగం, బాగారెడ్డి, దేవ కరుణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతల సమస్యల పరిష్కారానికి కమిషన్ పని చేస్తుంది..
రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్