
అల్బెండజోల్ మాత్రలు వేయించాలి
నిజామాబాద్‌నాగారం: జిల్లాలో నులి పురుగుల నిర్మూలనకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి బీ రాజశ్రీ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ, శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా 1–19 సంవత్సరాల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయంచాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు మాత్రలను అందజేస్తామన్నారు. అల్బెండజోల్ మాత్రలపై అపోహలు అవసరం లేదని, మాత్రలు తీసుకోవడం పిల్లల ఆరోగ్యానికి మంచిదన్నారు. నులి పురుగులను నిర్మూలించి పోషకాహార లోపాలని అరికట్టవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అఽ దికారి డాక్టర్ అశోక్, విద్యాశాఖ అకడమిక్ మానిటర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవో సౌందర్య, ప్రోగ్రా మ్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత, ఆర్‌బీఎస్‌కే మేనేజర్ సచిన్, వివిధ మండలాల మెడికల్ ఆఫీసర్లు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.
● నులిపురుగుల నిర్మూలనకు
కృషి చేయాలి
● జిల్లా వైద్యాధికారి రాజశ్రీ