ఖలీల్‌వాడి: తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనకు జయశంకర్ సార్ మార్గదర్శకులయ్యారన్నారు. ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్ తరాల కోసం బంగారు బాట వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో ఆసియా బేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజ, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, తిరుపతి, సీఐలు రమేశ్, వీరయ్య, సతీశ్, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సులు
ఖలీల్‌వాడి: రాఖీ పౌర్ణమి పండుగకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్‌ఎసం జ్యోత్స్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉమ్మ డి నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రత్యేక బ స్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి ఈనెల 7, 8, 9 లలో నిజామాబాద్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డి తోపా టు బోధన్ వైపునకు అదనపు బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం షెడ్యూల్ బస్సులతో పాటు 149 అదనపు బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామన్నారు. ఆర్మూరుకు 20, బోధన్‌కు 31, నిజామాబాద్‌కు 35, బాన్సువాడకు 19, కామారెడ్డికి 44 ప్రత్యేక బస్సులను సికింద్రాబాద్‌కు నడుపనున్నట్లు పేర్కొన్నారు.
ప్రైవేటు ఆస్పత్రికి నోటీసు
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవే టు ఆస్పత్రికి జిల్లా వైద్యాధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల క్రితం బిచ్కుంద మండలానికి చెందిన ఓ బాలుడికి జ్వరం రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు బా లుడిని నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో బాన్సువాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యు ల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందినట్లు బా లుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి బాధ్యత రహితంగా వ్యవహరించినట్లు నిర్ధారించి ఆస్పత్రికి నోటీసు జారీ చేశారు. మూడు రోజుల్లో ఆస్పత్రిని మూసివేయాలని సూచించినట్లు తెలిసింది.
పగిలిన పైప్‌లైన్
బాల్కొండ: ఎస్సారెస్పీ వద్ద కాకతీయ కాలువ వంతెనపై కాలనీకి నీటి సరఫరా చేసే పైపులైన్ పగిలిపోయింది. దీంతో నీరు లీకేజై వంతెనపై కుంటలా నిలిచింది. గురువారం ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా ప్రజాప్రతినిధులు నీటి విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో పైపు లైన్ నుంచి నీరు రాకుండా ఉండేందుకు సిబ్బంది ప్లాస్టిక్ కాగితం టేపును చుట్టారు. ఇనుప పైపుకు చిన్న వెల్డింగ్ మరమ్మతులు చేపడితే సమస్య పరిష్కారమయ్యేది. కానీ అలా కాకుండా కాగితం టేపును చుడుతుండటంపై కాలనీ వాసులు ఇదేమి చోద్యం అంటు ముక్కున వేలేసుకుంటున్నారు.

జయశంకర్ సార్‌కు ఘన నివాళి