
అక్రమ కేసులు ఎత్తేయాలి
మోపాల్: అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని బైరాపూర్‌కు చెందిన ప్రకాశ్, కవిత, జలంధర్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని ఏఐబీఎస్‌ఎస్ ప్రతినిధులు మూడ్ బాబూరావు, రమావత్ మోహన్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి బానోత్ నరేశ్ నాయక్ డిమాండ్‌చేశారు. కేసులు ఎత్తేయాలని, అటవీ భూమి సాగుకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐబీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నగరంలోని వర్నిరోడ్‌లోగల డీఎఫ్‌వో కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈమేరకు బుధవారం ఏఐబీఎస్‌ఎస్ నాయకులు డీఎఫ్‌వో కార్యాలయ ముట్టడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం గేట్లు మూసేయడంతో అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. గిరిజనులపై అక్రమ కేసులు ఎత్తేయాలని నినాదాలు చేశారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు సముదాయించారు. అనంతరం ఎఫ్‌ఆర్‌వో రాధికకు మోహన్ నాయక్, నరేష్ నాయక్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్ నాయక్, కొర్ర గంగాధర్, పీర్‌సింగ్, బాలు నాయక్, మోహన్ నాయక్, రవి నాయక్, సురేశ్ నాయక్, డాన్ శ్రీను, ఇందల్ నాయక్, నరేందర్, గోపాల్, శంకర్, సంగ్యానాయక్, పరుశరామ్, తదితరులు పాల్గొన్నారు.
బైరాపూర్ గ్రామస్తుల ముందస్తు అరెస్ట్
డీఎఫ్‌వో కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా ముఖ్య నాయకులు, గ్రామస్తులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. సీఐ సురేశ్‌కుమార్ సూచనల మేరకు కొందరు నాయకులు మాత్రమే డీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లి ఎఫ్‌ఆర్‌వోకు వినతిపత్రం అందజేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. అనంతరం వారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.
డీఎఫ్‌వో కార్యాలయ ముట్టడికి
ఏఐబీఎస్‌ఎస్ యత్నం
మోపాల్‌లో బైరాపూర్ గ్రామస్తుల ముందస్తు అరెస్ట్