
క్యాంపస్‌లో తీజ్ ఉత్సవాలు ప్రారంభం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో సోమవారం సాయంత్రం తీజ్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ మామిడాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బంజారా విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం హర్షనీయమన్నారు. తొమ్మిది రోజులపాటు తీజ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెయూ గిరిజన శక్తి విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీను రాథోడ్ తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతాబాయి, అకడమిక్ కన్సల్టెంట్ కిరణ్‌రాథోడ్, సిబ్బంది ప్రవీణ్ కుమార్, బికోజీ, నరేశ్, మహవీర్, రవీందర్ నాయక్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు సాగర్ నాయక్, ఏబీవీపీ అధ్యక్షుడు పృథ్వి, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.