
వాహనం ఆర్సీ మార్పిడి ఇలా...
సమాచారం
కమ్మర్‌పల్లి/ఖలీల్‌వాడి: ఎవరి దగ్గర నుంచైనా పాత వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)ని మధ్యవర్తుల సాయం లేకుండానే మన పేరు మీదకి సులభంగా మార్చుకోవచ్చు. అందుకోసం కింద తెలిపిన పత్రాలు సమకూర్చుకోవాలి.
● ఫారం 29, వాహనం అమ్మిన వారు ఇచ్చే సమాచారం
● ఫారం 30, కొనుగోలుదారుడు దరఖాస్తు కోసం
● ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్
● పొల్యూషన్(పీయూసీ) ధ్రువీకరణ
● పాన్ కార్డు
● చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్, పెన్సిల్ ఇంప్రింట్
● చిరునామా ధ్రువీకరణ పత్రం (ఆధార్, ఓటరు కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు)
● క్రయ, విక్రయదారుల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
● రోడ్డు పన్ను చెల్లించిన రశీదు
● ఫారం 28 ఎన్‌వోసీ (వాహనం ఇతర రాష్ట్రాలకు చెందినది అయితే)
● ఫైనాన్స్ ఉన్న వాహనాలకు సదరు సంస్థ నుంచి ఎన్‌వోసీ ఫారం 35 అవసరం అవుతుంది.
వాహన యజమాని మరణిస్తే ఫారం 31 మ రణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ ధ్రువీకరణ ప త్రం, వారసుల అఫిడవిట్ ఉండాలి. పై పత్రాలు సిద్ధంగా ఉంచుకొని ఆన్‌లైన్‌లో transport.telanga na.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి నమోదు చేసుకోవాలి. వాహన నంబర్, చాసిస్ నంబర్, చివరి 5 అంకె లు, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. అన్ని పత్రాలు అప్‌లోడ్ చేయాలి. సంబంధిత ఫీజు చెల్లించాలి. అనంతరం అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్న దరఖాస్తుతోపాటు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన పత్రాలను అందించాలి. అక్కడ ఆర్టీఏ అధికారులు పత్రాలను పరిశీలించి మీ ఫొటో తీస్తారు. నంబర్ నిర్ధారించి, ధ్రువీకరణ అనంతరం కొత్త ఆర్సీ జారీ చేస్తారు. పూర్తి వివరాలకు రవాణా శాఖ హెల్ప్ లైన్ నంబర్ 040–23370081 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.