
గల్ఫ్ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
ఇందల్వాయి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్ పాలసీ పథకం ద్వారా ఇందల్వాయి మండలానికి చెందిన ముగ్గురికి మంజూరైన రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియాను రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అర్గుల్‌లో సోమవారం అందజేశారు. గన్నారంకు చెందిన కషెట్టు లక్ష్మి, చంద్రాయన్‌పల్లికి చెందిన బండ్ల సుజాత, అన్సాన్‌పల్లికి చెందిన షేక్ హసీన వీరి భర్తలు గతంలో గల్ఫ్‌లో మృతి చెందగా పరిహారం మంజూరైనట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ తెలిపారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ పాలసీని అమలు చేయడం గొప్ప విషయమని అన్నారు. పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.