
‘ప్రజలే తగిన బుద్ధి చెబుతారు’
ఆర్మూర్‌టౌన్: జనహిత పాదయాత్రకు లభించిన విశేష జనదారణను జీర్ణించుకోలేని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మారచంద్రమోహన్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబాగౌడ్ ఎద్దేవా చేశారు. పాదయాత్ర విజయంతం కావడాన్ని పుర్కరించుకొని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను గుర్తించడానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టారన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులపై మరోసారి నోరు జారితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ విట్టం జీవన్, కాంగ్రెస్ నాయకులు చిన్నా రెడ్డి, పండిత్ పవన్, ఫయాజ్, మాజిద్, రేగుల సత్యనారాయణ, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు.