
దేశాభివృద్ధి కోసం పని చేయాలి
డిచ్‌పల్లి: విద్యార్థులు జాతీయ భావాలతో, దేశం కో సం, దేశాభివృద్ధి కోసం పని చేయాలని ఏబీవీపీ జా తీయ కార్యవర్గ సభ్యుడు బి.శివ పిలుపునిచ్చారు. సోమవారం ఏబీవీపీ డిచ్‌పల్లి శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎస్‌పీఆర్ ఇంటర్, డిగ్రీ కళాశాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని విద్యారంగ సమస్యలు, విద్యార్థుల కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఏబీవీపీలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెయూ ఏబీవీపీ సెక్రెటరీ సమీర్, నాయకులు లెనిన్, అనిల్, నెహ్రూ, రామకృష్ణ, హర్షనందన్, విద్యార్థులు పాల్గొన్నారు.