
తడి పొడి.. పర్యవేక్షణ కొరవడి
నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెత్తపై ప్రత్యేక దృష్టి సారించడం లేదు. మొ క్కుబడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యే క పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సీడీఎంఏ అధికారులు వంద రోజుల ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళిక కేవలం పేపర్లకే పరిమితమవుతోంది.చెత్త ఎలా సేకరించాలి అనే అంశంపై మ హిళలకు అవగాహన కల్పించడంలో అధికారులు క్షేత్రస్థాయిలో దృష్టిసారించడం లేదు. దీంతో చెత్తపై అవగాహన కరువైంది. నగరంలో ప్రతీరోజు వంద టన్నుల చెత్త తయారవుతోంది. ఈ చెత్తను ఇంటింటికి తిరిగి సేకరించి వాహనాల ద్వారా నాగారంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అయితే చెత్త మొత్తం ఒకే చోట కాకుండా వేర్వేరుగా నిల్వ చేయాలి. తడి, పొడి, హానికరమైన చెత్తగా మూడు విభాగాలుగా విభజిస్తారు. తడి చెత్త అంటే ఇంట్లో పాచిపోయిన ఆహారపదార్థాలు, కుళ్లిపోయిన పండ్లు వంటివి. పొడి చెత్త అంటే పేపర్లు, పాలిథిన్, ప్లాస్టిక్ కవర్లు. హానికర చెత్త అంటే హాస్పిటల్స్‌లో వాడే సిరంజీలు, ఇంజక్షన్ బాటిళ్లు, ఆపరేషన్‌కు వాడే బ్లేడ్స్, కాటన్, ప్యాడ్ వంటివి. వీటిలో పై రెండు మున్సిపల్ సిబ్బంది తమ వాహనాల ద్వారా సేకరిస్తారు. మూడోది హానికరమైన చెత్త సేకరించేందుకు ప్రత్యేకమై ఏజెన్సీలు తమ వాహనాల ద్వారా చెత్త సేకరించి వారికి కేటాయించిన స్థలంలో నగరశివార్లలో వాటిని కాల్చివేసి, బూడిదను పూడ్చివేస్తారు.
తడి–పొడిచెత్త వేరుచేసేదెలా..
తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. ప్రతి రోజు పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. అయితే గృహిణులు చెత్తను ఒకే బుట్టలో వేస్తున్నారు. దీంతో అదే చెత్తను కార్మికులు చెత్త వాహనంలో వేస్తున్నారు. దానిని డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. ఈ అంశంపై అధికారులు అవగాహన కల్పించడం లేదు.
వేర్వేరు డబ్బాల్లో..
ప్రతి ఒక్కరు ఇంట్లో, దుకాణాల్లో తయారయ్యే చెత్తను వేర్వేరుగా నిల్వచేయాలి. వాటి కోసం ప్రత్యేకంగా రెండు బుట్టలు(డబ్బాలు) వాడాలి. ఈ అంశంపై గృహిణులకు అధికారులు అవగాహన కల్పించడం లేదు. పదేళ్ల క్రితం 2014లో నాటి ప్రభుత్వం ఇంటింటికి రెండు డబ్బాల(నీలి, ఆకుపచ్చరంగు)ను ఉచితంగా అందించింది. నాటి నుంచి ఇప్పటివరకు మళ్లీ డబ్బాలను పంపిణీ చేయలేదు. మహిళలకు చెత్తపై వివరించడం లేదు.
అవగాహన అవసరం
చెత్త తయారీ, చెత్త నిల్వలో మహిళలదే ప్రధాన భూమిక. వారికి అవగాహన కల్పించడం అధికారుల కంటే మహిళా సంఘాలదే ప్రధాన బాధ్యత. మహిళా సమాఖ్య, సీ్త్రనిధి, స్వయం సహాయ సంఘాలు వంటి పలు సంఘాలు మెప్మా ఆధీనంలోనే ఉంటాయి. వీరంతా మహిళలే నిర్వహిస్తారు. కాబట్టి మహిళలకు, గృహిణులకు చెత్త నిల్వ, చెత్త సేకరణ వంటి అంశాలు వీరే వివరించాలి. ఈ విషయంలో బల్దియా అధికారులు, ఇన్‌చార్జి ఎంహెచ్‌వో, డిప్యూటీ కమిషనర్ వంటి ఉన్నతాధికారులు దృష్టి సేకరించాలి. వారితో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ తడి–పొడిచెత్త వేర్వేరుగా సేకరించడం విజయవంతంగా సేకరించగలుగుతాం.
ప్రజలకు చెత్తపై అవగాహన
కల్పించడంలో అధికారులు విఫలం
మహిళా సంఘాల ద్వారా
ప్రచారం నిల్
అవగాహన కల్పిస్తున్నాం
చెత్త సేకరణపై ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు అవగాహన కల్పించినా ఇంకా పూర్తిస్థాయి లో వివరించలేకపోతున్నాం. మెప్మా సంఘాలకు బాధ్యత అప్పగిస్తాం.
– రవిబాబు, ఇన్‌చార్జి ఎంహెచ్‌వో

తడి పొడి.. పర్యవేక్షణ కొరవడి