
కాంగ్రెస్‌లో పలువురి చేరిక
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బుచ్చన్న, శ్రీధర్, ఆకుల జగన్, గౌసొద్దీన్, ఎల్లయ్య, కిశోర్‌గౌడ్, జీవన్, ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి
మోపాల్: విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. మోపాల్ మండలంలోని సిర్‌పూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సంస్థ ఆధ్వర్యంలో 400 నోట్‌బుక్స్, 200 పెన్నులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గత 21 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సభ్యులు అమర్, రామ్మోహన్, టీఎస్ వ్యాస్, ఉపాధ్యాయులు నాగమణి, రాము, అనురాధ, గంగాప్రసాద్, వీడీసీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రేషన్ కార్డుల పంపిణీ
ధర్పల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో అధికారులు, కాంగ్రెస్ నాయకులు నూతన రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని రాని వారు ఆందోళన చెందవద్దని అధికారులు పేర్కొన్నారు. నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

కాంగ్రెస్‌లో పలువురి చేరిక