
ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత
నిజామాబాద్‌అర్బన్: ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, తపస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్స్, విద్యార్థులు సోమవారం గిరిరాజ్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో తపస్ ఫౌండేషన్ అధ్యక్షుడు విపుల్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ నరేశ్, నాగజ్యోతి, దస్తప్ప, రజిత, వెంకటరమణ, సుధాకర్, పీఆర్వో దండు స్వామి, రంజిత, వినయ్ కుమార్, ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ రామస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు.
సిద్ధి యోగా భవన్‌లో..
నిజామాబాద్ రూరల్: వినాయక్‌నగర్‌లోని సిద్ధి యోగా భవన్‌లో ఇందూరు జిల్లా భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగా సమితి, కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయుర్వేద ఔషద మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఇంజినీర్ గంగాధర్, బుచ్చన్న, కిషన్, లింబాద్రి, నాగరాజు, గంజి సాయన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత