
చలో ఢిల్లీకి కాంగ్రెస్ బీసీ నాయకులు
మోపాల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 5, 6 తేదీల్లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీసీ నాయకులు సోమవారం తరలివెళ్లారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరితో కలిసి టీపీసీసీ డెలిగేట్, నిర్మల్ జిల్లా పరిశీలకుడు బాడ్సి శేఖర్ గౌడ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైల్‌లో బయలు దేరారు. వీరి వెంట బీసీ నాయకులు ఉన్నారు.
సిరికొండ: మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు దేశ రాజధాని ఢిల్లీకి సోమవారం వెళ్లారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నాలో పాల్గొనడానికి వారు తరలివెళ్లారు. పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, దేగాం సాయన్న, ఉమ్మాజి నరేశ్, డీలర్ రమేశ్, బడాల మహిపాల్ తదితరులు ఉన్నారు.

చలో ఢిల్లీకి కాంగ్రెస్ బీసీ నాయకులు