
26 రోజుల పనిదినాలు కల్పించాలి
డిచ్‌పల్లి: నెలలో 26 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం బీ డీ కార్మికులు డిచ్‌పల్లి మండల కేంద్రంలోని శివాజీ బీడీ కంపెనీని ముట్టడించారు. ముందుగా బీడీ కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కంపెనీలోకి వెళ్లి బైఠాయించారు. కొద్దిసేపు అందోళన చేసి న అనంతరం కననీ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధా న కార్యదర్శి వెంకటి మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా బీడీ కార్మికులకు నెలకు 10 రోజుల పని మా త్రమే పని కల్పిస్తున్నారన్నారు. చేతినిండా పని లేకపోవడంతో బీడీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తక్షణం కార్మికులకు 26 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీడీ పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో టీ యూసీఐ ఏరియా కార్యదర్శి కిషన్, జిల్లా నాయకుడు మురళి, బీడీ టేకేదార్లు నర్సయ్య, సాయినా థ్, సుదర్శన్, శ్రీధర్, గణేశ్, రవి, కార్మికులు లక్ష్మి, సుజాత, నర్సయ్య, గౌతమి, జమున, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.