
జాతీయ మహాసభలకు బయల్దేరిన నాయకులు
నిజామాబాద్‌నాగారం: గోవాలో నిర్వహించే జాతీయ బీసీ మహాసభలకు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు సోమవారం బస్సులో బయలుదేరారు. బీసీ నేతల ప్రయాణాన్ని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. బీసీ మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తాహెర్‌బిన్ హందాన్ అన్నారు. బీసీలు అన్ని రంగాల్లో రాణించాలంటే 42శాతం రిజర్వేషన్లు రావాల్సిందేనన్నారు. బీసీలు సామాజిక ఇంజినీర్లు అని గ్రంథాలయ చైర్మన్ అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, బుస్స ఆంజనేయులు, పొల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, మాడవేడి వినోద్, కొయ్యాడ శంకర్, శ్రీలత, బగ్గలి అజయ్, చంద్రకాంత్, నారాయణ రెడ్డి, కోడూరు స్వామి, బసవ సాయి, అన్నయ్య, విజయ్, జయ, రుక్మిణి, మహేశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.