
బీసీల రిజర్వేషన్ల సాధనకే జనహిత పాదయాత్ర
జక్రాన్‌పల్లి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికే జనహిత పాదయాత్ర చేపడుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. శనివారం అర్గుల్ పీవీఆర్ గార్డెన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనహిత పాదయాత్రలో భాగంగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌లో ఆదివారం నిర్వహించే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్తకర్తల సమావేశాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, మంత్రి సీతక్క హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్రలో గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడే పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్ధేశం చేస్తారన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు రిజర్వేషన్ల కోసం బీఆర్‌ఎస్ నాయకులు దీక్ష చేస్తామనడం హాస్యస్పదమన్నారు. సమావేశంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్, మాజీ ఎంపీపీ అప్పాల రాజన్న, పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు చిన్న సాయారెడ్డి, వసంత్‌రావు, సొప్పరి వినోద్, కాట్‌పల్లి నర్సారెడ్డి, గంగారెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి