
స్నేహం పేరిట దోపిడీలు..
కామారెడ్డి క్రైం: స్నేహం పేరు మీద సోషల్ మీడియాలో నుంచి పలు యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, వాటిలో గ్రూప్‌లు తయారు చేసి సభ్యులను చేర్చడం, ఆపై అమాయకులను టార్గెట్ చేసి దాడులు, దోపిడీలకు పాల్పడటం వారి పని. కామారెడ్డితో పాటు చుట్టు పక్కల జిల్లాలలో నాలుగేళ్లుగా ఓ కొత్త రకం దోపిడీలను గుట్టుచప్పుడు కాకుండా చేస్తూ, లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను కామారెడ్డి పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. గత నెల 25 న ఓ బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియా యాప్‌ల ద్వారా పరిచయమైన కొందరు వ్యక్తులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెగా కార్ షెడ్డు వద్దకు తనను పిలిపించి తన ఫొటోలు తీసి, వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడమే కాకుండా డబ్బులు ఇవ్వకుంటే వాటిని అందరికీ పంపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశాడు. ఫోన్‌పే ద్వారా బలవంతంగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన షేక్ జోహెబ్, మహమ్మద్ మిరాజ్ పాషా, సయ్యద్ ముజాఫర్ అలీ, సిరిసిల్ల జిల్లా చంద్రంపేట్ గ్రామానికి చెందిన షేక్ సొహైల్ లతో పాటు ఓ మైనర్ లను నిందితులుగా గుర్తించారు. వారంతా గత నాలుగేళ్లుగా సోషల్ మీడియా యాప్‌ల ద్వారా అమాయకులకు వల వేస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లోని 41 ఘటనల్లో ఈ ముఠా దాడులు, వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. వసూళ్ల మొత్తం ఇప్పటికి రూ. 8 లక్షల వరకు నిర్ధారణ జరిగిందన్నారు. కాగా రూ. 40 లక్షలకు పైగా వసూలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై కామారెడ్డిలో 6, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పీఎస్ పరిధిలో 2, నిజామాబాద్‌లో ఒకటి చొప్పున మొత్తం 9 కేసులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. ఇంకా చాలామంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
ఎవరైనా బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ముఠా సభ్యులపై గతంలో కూడా కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో 11 కేసులు ఉన్నాయన్నారు. వాటిలో నిజామాబాద్‌లో ఓ యువకుడిని గతంలో ఇదే తరహాలో నమ్మించి హత్యకు పాల్పడిన కేసు కూడా ఉందని వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని అన్నారు.
సోషల్ మీడియా యాప్‌లతో పరిచయాలు..
నిందితులు సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుంటారు. యూత్, ట్రాన్స్‌జెండర్, లెస్బియన్స్, తదితర వాట్సప్ గ్రూప్ లను డౌన్‌లోడ్ చేసి వాటిలో చాలామందిని యాడ్ చేస్తూ గ్రూప్‌లుగా తయారు చేస్తారు. ముఖ్యంగా స్వలింగ సంపర్కులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పరిచయాలు పెంచుకుని అమయకులైన లెబ్బియన్ లను నిర్మాణుష్య ప్రదేశాలకు పిలుస్తారు. రాగానే దాడులకు పాల్పడి ఉన్నదంతా దోచుకుంటారు. అంతే కాకుండా ఫొటోలు తీసి, డబ్బులు ఇవ్వాలనీ, లేకుంటే మార్ఫింగ్ చేసి అందరికీ షేర్ చేస్తామని బెదిరిస్తారు. నిందితుల్లో షేక్ సోహైల్ ఇదివరకు ఆర్మీలో పని చేసి వచ్చాడు. సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన ఎస్పీ సూచించారు. కేసు చేధనలో కృషి చేసిన పట్టణ సీఐ నరహరి, సీసీఎస్ ఎస్సైలు శ్రీనివాస్, ఉస్మాన్, నరేష్, వినయ్ సాగర్, రాజారాం, బాల్ రెడ్డి, నరేష్, సిబ్బంది మైసయ్య, రవి, కమలాకర్, నరే
ష్, రాజు, భాస్కర్ లను అభినందించారు.
సోషల్ మీడియా వేదికగా
యాప్‌లతో వల
నిర్మానుష్య ప్రాంతాలకు
పిలిచి దాడులు, దోపిడీ
ఐదుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
వివరాలు వెల్లడించిన
ఎస్పీ రాజేశ్ చంద్ర