
ఎరువుల వివరాలు పక్కాగా ఉండాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ఇందల్వాయి/ధర్పల్లి: ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేసి ఆ వివరాలను స్టాక్ బోర్డుపై రైతులకు తెలిసేలా ప్రదర్శించాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సొసైటీ సీఈవోలను ఆదేశించారు. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లె , ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామాల్లో శ నివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎ రువుల గోదాములు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలను తనిఖీ చేశారు. రైతుల అవసరాల మేరకు ఎరువుల అందుబాటులో ఉండేలా చూడాలని సూ చించారు. అనంతరం పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్.. పాఠశాలల్లో టీచర్ల హాజరును ఫేస్ రికగ్నేషన్ పద్ధతిలో చేపట్టాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు. అంగన్‌వాడీల్లో విద్యార్థుల ప్రవేశాలు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చేలా అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఎల్లారెడ్డిపల్లె పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి నుంచి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. ఇల్లు నిర్మించుకునే వారందరికీ సకాలంలో బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు.