ప్రత్యేక పారిశుధ్య పనులు షురూ..!
నిజామాబాద్ సిటీ: నగరంలో ప్రత్యేక పారిశుధ్య పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం 10 డివిజన్లలో మున్సిపల్ శానిటరీ సిబ్బంది పనులు నిర్వహించారు. ఖానాపూర్, కాలూరు, మాణిక్‌భండార్, బోర్గాం(పి), పాంగ్రా, వినాయక్‌నగర్‌లో పనులు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి తడి–పొడి చెత్త సేకరణ, డ్రైనేజీలు శుభ్రం చేయడం, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పరిశీలన, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కల తొలగింపు వంటి పనులు చేశారు. దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పర్యవేక్షించారు. ఏఎంసీ జయకుమార్, సానిటరీ సూపర్‌వైజర్ సాజిద్ అలీ, ఇన్‌స్పెక్టర్లు షాదుల్లా, సునీల్, కృష్ణ, జవాన్లు, తదితరులున్నారు.


