నవోదయ గ్రామీణ విద్యార్థులు అనుకూలం
జక్రాన్‌పల్లి: ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు నవోదయ, పసుపు బోర్డు తీసుకువచ్చిన ఘనత ఎంపీ అర్వింద్‌కు దక్కుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. నవోదయ మంజూరును హర్షిస్తూ మంలంలోని కలిగోట్‌లో శనివారం ఎంపీ అర్వింద్, ప్రధాని మోదీ చిత్రపటాలకు నాయకులతో కలిసి దినేశ్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామమైన కలిగోట్ ప్రాంతంలో నవోదయ ఏర్పాటుతో ఈ ప్రాంతం విద్యాభివృద్ధికి నిలయంగా మారుతుందన్నారు. ఇక్కడ విద్యాలయం ఏర్పాటు అన్ని మండలాల విద్యార్థులకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. నవోదయ, పసుపు బోర్డు కార్యాలయం రూరల్ నియోజక వర్గంలో ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమన్నారు. అలాగే 44 నంబర్ జాతీయ రహదారిపై సర్వీసు రోడ్లు, ప్రధాన కూడళ్ల ఏర్పాటుకు ప్రధాని మోదీ నిధులు మంజూరు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, నాయకులు మహేందర్, శ్రీనివాస్‌గౌడ్, దత్తాద్రిగౌడ్, నాయిడి రాజన్న, ఆనంద్, శశాంక్, సతీశ్, కొరట్‌పల్లి నర్సయ్య, అశోక్, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి


