కలెక్టరేట్‌లో రక్తదాన శిబిరం
అభినందించిన కలెక్టర్
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ప్రారంభించగా, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతోపాటు వివిధ శాఖలకు చెందిన సుమారు 60 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తలసేమియా పేషెంట్ల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు రక్తదానం ఉపకరిస్తుందని గుర్తుచేశారు. రక్తదానం చేసిన ఉద్యోగులకు రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ప్రశంసాపత్రాలు అందజేశారు. రెడ్‌క్రాస్ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, అసోసియేషన్ ప్రతినిధులు మహేశ్, శ్రీనివాస్, రెడ్‌క్రాస్ బాధ్యులు బుస్స ఆంజనేయులు, తోట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో రక్తదాన శిబిరం


