దాబా హోటళ్లలో తనిఖీలు
డొంకేశ్వర్(ఆర్మూర్): వన్యప్రాణుల మాంసాన్ని వండిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవ ని అధికారులు హెచ్చరించారు. మండలంలోని ప లు గ్రామాల్లో ఉన్న దాబా హోటళ్లలో పోలీసు, అట వీ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్‌లలో నిలువ ఉంచిన మాంసాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కుందేళ్లు, నెమళ్లు, దుప్పిలు మొదలగు అటవీ జంతువులను వండకూడదన్నారు. వన్యప్రాణుల ను వేటాడినా, వాటికి హాని కలిగించినా శిక్షకు గురవుతారని తెలిపారు. బయటి వ్యక్తులు వేట మాంసాన్ని తీసుకువస్తే అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఒకవేళ అలాంటి వారికి సహాయం చేస్తే నాన్ బెయిల్ కేసులు నమోదు చేస్తామని నోటీసులు అందజేశారు. తనిఖీల్లో డిప్యూటీ ఎఫ్‌ఆర్వో సుధాకర్, పోలీసులు పాల్గొన్నారు.


