ఎల్‌ఆర్‌ఎస్‌తో బల్దియాకు రూ.34.70 కోట్లు
తిరస్కరణకు కారణాలివే..
నిజామాబాద్ సిటీ: లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్)తో ప్రభుత్వానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.34.70 కోట్ల ఆదాయం స మకూరింది. మొత్తం 33,793 దరఖాస్తులు రాగా అందులో 9,258 మంది ఫీజును చెల్లించారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా జీహెచ్‌ఎంసీ మినహా ఇతర మున్సిపాలిటీల్లో నిజామాబాద్ 8వ స్థానంలో నిలిచింది.
రెండుసార్లు గడువు పొడిగింపు..
నాన్ లేఅవుట్ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం 2016లో ఎల్‌ఆర్‌ఎస్ స్కీంను ప్రవేశపెట్టింది. కాగా, ప్రస్తుత ప్రభుత్వం సైతం స్కీంను ప్రవేశపెట్టి రెండు సార్లు గడువు పొడిగించింది. మొదట మార్చి 31 వరకు ఫీజుల చెల్లింపునకు అవకాశమివ్వగా, చివరగా ఈ నెల 3వరకు గడువిచ్చింది. కార్పొరేషన్ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు మొత్తం 33,793 మంది దరఖాస్తు చేసుకోగా, 9,258 మంది ఫీజును చెల్లించారు. వారిలో 5,372 మంది దరఖాస్తులు పరిశీలించి సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారికి అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇంకా 3,886 మందికి చెందిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
మొత్తం 33,793 దరఖాస్తులు
5,372 మందికి ప్రొసీడింగ్స్
గడువు ముగిసినట్లే
ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కోసం ప్ర భుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 3తో ముగిసింది. సమ యం పొడిగించారని వస్తు న్న వార్తల్లో వాస్తవం లేదు. ఇప్పటి వరకు వచ్చిన దర ఖాస్తులను పరిశీలించి అన్ని ధ్రువీకరణ పత్రాలున్నవారికి ప్రొసీడింగ్స్ ఇచ్చాం. కొంతమందివి పెండింగ్‌లో ఉన్నాయి. సరైన పత్రాలు లేని, ప్రభుత్వ ని బంధనలకు విరుద్ధంగా ఉన్నవాటికి అనుమతివ్వలేదు. – తేరాల శ్రీనివాస్,
అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి
ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరివి తిరస్కరణకు గురయ్యాయి. సరైన డాక్యుమెంట్లు లేకపోవడం, ప్లాట్ నాలాలు, మోరీల పక్కనే ఉండటం, ప్రభుత్వ స్థలంలో ప్లాట్లు ఉండటం, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, మాస్టర్ ప్లాన్‌లోకి వచ్చే భూములు, పార్కు స్థలాలు, సరైన ఫీజు చెల్లించని వారి దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.
ఎల్‌ఆర్‌ఎస్‌తో బల్దియాకు రూ.34.70 కోట్లు


