విస్తరణ ఎన్నడో? | - | Sakshi
Sakshi News home page

విస్తరణ ఎన్నడో?

Apr 29 2025 9:55 AM | Updated on Apr 29 2025 9:57 AM

నిజామాబాద్‌

కమిటీ నిర్ణయమే కీలకం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో

కమిటీల నిర్ణయమే కీలకంగా మారింది.

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

– 8లో u

సీపీని కలిసిన ఆదర్శ రైతు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ప్రకృతి వ్యవసాయ చేస్తున్న ఎడపల్లి మండలం జైతాపూర్‌ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కరు టూరి పాపారావు పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్యను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన వ్యవసాయం క్షేత్రంలో పండి న వివిధ రకాల పండ్లను సీపీకి అందించా రు. ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన రైతు మహోత్సవంలో పాపారావు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించిన సీపీ.. పాపారా వు చేస్తున్న సుభాష్‌ పాలేకర్‌ వ్యవసాయ విధానంపై ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో తాజాగా కలిసి పండ్లను అందించినట్లు పాపారావు తెలిపారు.

నేడు జిల్లా కాంగ్రెస్‌

విస్తృతస్థాయి సమావేశం

నిజామాబాద్‌ సిటీ: డిచ్‌పల్లి మండలంలోని కేఎన్‌ఆర్‌ గార్డెన్‌లో కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాన్సువాడ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్‌ భూపతిరెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, నుడా చైర్మన్‌ కేశ వేణు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు, ఆర్మూర్‌, బాల్కొండ ఇన్‌చార్జీలు వినయ్‌ రెడ్డి, సునీల్‌ రెడ్డి, బాన్సువాడ బాధ్యులు రవీందర్‌ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు.

లండన్‌లో తప్పిపోయిన జిల్లా విద్యార్థి

బాల్కొండ: నిజామా బాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం రెంజర్ల గ్రా మానికి చెందిన వి ద్యార్థి నల్ల అనురాగ్‌రెడ్డి ఈనెల 25న లండన్‌లో తప్పిపోయా డు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనురాగ్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం ఏడాదిన్నర క్రితం స్టూడెంట్‌ వీసాపై లండన్‌ వెళ్లాడు. ఈనెల 25న సాయంత్రం స్నేహితులతో కలిసి కార్డిప్‌ ప్రాంతానికి వెళ్లాడు. కొంత సమయం తర్వాత స్నేహితులకు కనిపించలేదు. దీంతో వారు అతడి తల్లి హరితారెడ్డికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. అనురాగ్‌రెడ్డికి ఫోన్‌ చేస్తున్నా స్పందన లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లి హరితారెడ్డి ఈ విషయాన్ని సోమవారం టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లారు. తన కుమారుడిని వెతికించి, స్వదేశానికి రప్పించాలని కోరారు. ఈరవత్రి అనిల్‌ స్పందించి సీఎంవో కార్యాలయ అధికారులతో మాట్లాడారు. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్‌లోని ఇండియా హైకమిషన్‌కు లేఖలు రాసినట్లు అనిల్‌ కుమార్‌ తెలిపారు.

సుభాష్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని కూరగాయల హో ల్‌సేల్‌ మార్కెట్‌ విస్తరణ ఎప్పుడెప్పుడాని వ్యాపారులు, వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 12వేల క్వింటాళ్ల కూరగాయలు, ఆకుకూరల క్రయావిక్రయాలు మార్కెట్‌లో జరుగుతుంటాయి. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వ్యాపారులు, రైతులు కూరగాయలు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్‌ ఇరుకుగా మారడంతో వ్యాపారులతోపాటు కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈవిషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

గాంధీగంజ్‌లో దశాబ్దాలపాటు కూరగాయల మార్కెట్‌ కొనసాగగా, నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో శ్రద్ధానంద్‌ గంజ్‌లో 2017లో కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ను 60 మడిగెలతో ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెట్‌లో 95 మంది వరకు వ్యాపారులు లైసెన్సులను కలిగి ఉండగా, 60 మందికి మడిగెలు కేటాయించారు. రైతులు సైతం తాము సాగు చేసి తీసుకొచ్చిన కూరగాయలను అక్కడే విక్రయిస్తుంటారు. ప్రతిరోజూ ఉదయం 4 నుంచి 9 గంటల వరకు హోల్‌సేల్‌ మార్కెట్‌ కొనసాగుతోంది.

కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌లో ప్రతిరో జు సగటున 12వేల క్వింటాళ్ల కూరగాయలు, ఆకుకూరల క్రయవిక్రయాలు జరుగుతాయి. మార్కె ట్‌కు జూలై నుంచి ఫిబ్రవరి వరకు సరుకు ఎక్కువ మొత్తంలో, మార్చి నుంచి జూన్‌ వరకు వేసవి దృష్ట్యా కూరగాయలు తక్కువగా వస్తాయి. మహారా ష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, హైదరాబాద్‌, రంగారెడ్డితోపాటు జిల్లాలోని వివిధ మండలాల నుంచి రైతులు, వ్యా పారులు కూరగాయలు ఇక్కడ విక్రయించేందుకు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి కామారెడ్డి, బాన్సువాడ, నిర్మల్‌, జగిత్యాల, ఆర్మూర్‌, ఎల్లారెడ్డి డివిజన్‌లతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ మండలాలు, గ్రామాలకు రిటైల్‌ వ్యాపారులు కూరగాయలు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు.

సభ విజయవంతం

చేసిన వారికి ధన్యవాదాలు

ప్రకటనలో మాజీ మంత్రి,

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

న్యూస్‌రీల్‌

ఇరుకిరుకుగా జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌

రోజూ 12వేల క్వింటాళ్ల

హోల్‌సేల్‌ వ్యాపారం

మహారాష్ట్ర, ఏపీ సహా జిల్లాల నుంచి కూరగాయలు తీసుకొస్తున్న వ్యాపారులు

వాహనాల రద్దీతో ట్రాఫిక్‌కు

తీవ్ర అంతరాయం

ఇబ్బందులు పడుతున్న

వ్యాపారులు, వినియోగదారులు

ప్రతిపాదనలు పంపించాం

నిజామాబాద్‌ కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ విస్తరణ కు ప్రతిపాదనలు పంపించాం. మార్కెట్‌ ఇరుకుగా మారడంతో నిత్యం ఫిర్యాదు లు వస్తున్నాయి. వినియోగదారులు, వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టు కుని రూ.కోటితో 40 మడిగెలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాం. మార్కెటింగ్‌శాఖ ఉ న్నతాధికారుల పరిశీలన కూడా పూర్తయ్యింది. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.

– ముప్ప గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌, నిజామాబాద్‌

నడవడమే కష్టం

హోల్‌సేల్‌ మార్కెట్‌ హోల్‌ సేల్‌, రిటైల్‌ వ్యాపారులు, వినియోగదారులతో ప్రతిరోజూ కిటకిటలాడుతుంది. తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 గంటల వరకు నడవ డం కూడా కష్టంగా ఉంటుంది. ఇదే అదను గా భావించి కొందరు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటనలు కూడా ఉన్నా యి. మార్కెట్‌లో నడవ డం కష్టం అనుకుంటే.. రి టైల్‌ వ్యాపారుల ఆటోలు, తోపుడు బండ్లు, వ్యాన్లు, మినీ డీసీఎంలతో మరింత ఇబ్బందికరంగా మారుతోంది. వినియోగదారులు, వ్యాపారులు పలుమార్లు ఈ విషయాన్ని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

విస్తరణ ఎన్నడో?1
1/3

విస్తరణ ఎన్నడో?

విస్తరణ ఎన్నడో?2
2/3

విస్తరణ ఎన్నడో?

విస్తరణ ఎన్నడో?3
3/3

విస్తరణ ఎన్నడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement