ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే సమ్మర్ క్యాంప్
ఖలీల్‌వాడి: ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే ఫ్రీ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌బీవీఆర్‌ఆర్ స్కూల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి మే 2 వరకు నిర్వహించే ఫ్రీ సమ్మర్ క్యాంప్‌ను సీపీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాఠశాల చదువులకు సమ్మర్ క్యాంప్‌లకు చాలా తేడా ఉంటుందన్నారు. ఈ క్యాంప్‌లో విద్యార్థినులు ఎలా ఉండాలి, ఎలా చదువు కోవాలి, ఎలా భవిష్యత్తులో ముందుకెళ్లాలి, సమస్యలు ఉంటే ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై క్లుప్తంగా వివరించడం జరుగుతుందని తెలిపారు. శిబిరంలో విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు సెల్ఫ్ మో టివేషన్ తరగతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ ఐపీఎస్ సాయి కిరణ్ పత్తిపాక, సౌత్ రూరల్ సీఐ ఎన్ సురేశ్ కుమార్, యోగా మాస్టర్ జె. కిషన్, తైక్వాండో ట్రెయినర్ మనోజ్, రూరల్ పోలీస్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
సీపీ పోతరాజు సాయిచైతన్య


