జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపిక
సిరికొండ: జాతీయ మేజర్ లీగ్ బేస్‌బాల్ ఇండియా కప్–2025 పోటీలకు నిజామాబాద్ పైరేట్స్ (సిరికొండ సత్యశోధక్ పాఠశాల) జట్టు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ నర్సయ్య శుక్రవారం తెలిపారు. ఆర్మూర్‌లో ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగిన మేజర్ లీగ్ బేస్‌బాల్ అండర్–11 ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ పైరేట్స్(సత్యశోధక్) జట్టు విజేతగా నిలిచి ఛాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రీజినల్ స్థాయిలో లీగ్ దశలో నిజామాబాద్ పైరేట్స్ జట్టుతో పాటు 12 జట్లు పాల్గొనగా తొర్లికొండ జట్టుపై సత్యశోధక్ జట్టు విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. మేజర్ లీగ్ బేస్‌బాల్ కప్ ఇండియా హెడ్ ఇంచార్జ్ జపాన్‌కు చెందిన రియో చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్నారు. బెంగుళూర్‌లో జూన్ మొదటి వారంలో జరిగే జాతీయ మేజర్ లీగ్ పోటీల్లో సత్యశోధక్ జట్టు పాల్గొంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.


