
హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి మురళి
బీవోసీ రాష్ట్ర అధ్యక్షులు అనురాధ
మోపాల్: కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి, ఆదర్శ కమ్యూనిస్టు జెల్ల మురళి అని ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణాల కార్మిక సంఘం(బీవోసీ) రాష్ట్ర అధ్యక్షులు అనురాధ అన్నారు. శుక్రవారం నగర శివారులోని బోర్గాం(పి) శ్రామికనగర్ గూడెంలో జెల్ల మురళి సంస్మరణ సభ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దోపిడీ వర్గ వ్యతిరేక విధానాలపై మురళీ పోరాడి శ్రామికుల పక్షాన నిలబడ్డారని తెలిపారు. పీడిత ప్రజలకు సమాన అవకాశాలు ఇవ్వాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరుకున్నారన్నారు. ఆయన జీవించిన కాలం కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి ఆదర్శంగా ఉన్నారని పేర్కొన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, నాయకులు వేల్పూర్ భూమయ్య, ఎన్ దాసు, నీలం సాయిబాబా, మల్లికార్జున్, పరుచూరి శ్రీధర్, సాయిబాబా, సూర్య శివాజీ, శివకుమార్ పాల్గొన్నారు.