విశ్రాంత ఉద్యోగులు సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలి
నిజామాబాద్ నాగారం: విశ్రాంత ఉద్యోగులు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. సుభాష్‌నగర్‌లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్– రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ నిర్మించిన పెన్షనర్స్– సీనియర్ సిటీజన్ భవనంను గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్షనర్స్, సినీయర్ సిటిజన్స్ యోగక్షేమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భవనానికి ధన్‌పాల్ లక్ష్మిబాయి– విఠల్‌గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వంద కుర్చీలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, మహిళా–శిశు సంక్షేమ, వయో వృద్ధుల శాఖ జిల్లా అధికారిణి రసూల్‌బి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రావు, మదన్ మోహన్, ఈవీఎల్ నారాయణ, హమీద్, శిర్ప హనుమాండ్లు, రాధా కిషన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయ పరిశీలన
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల అభిప్రాయాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కార్యదర్శి బుగ్గారెడ్డి, ముప్ప గంగారెడ్డి, మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
విశ్రాంత ఉద్యోగులు సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలి


